ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీటెక్ రవికి చంద్రబాబు ఫోన్​ - విజయవాడ తాజా సమాచారం

తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో తెదేపాను అణగదొక్కలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బెయిల్​పై విడుదలైన తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి తెలుగుదేశం అధినేత ఫోన్ చేసి పలకరించారు.

Chandrababu greeted btech Ravi by phone
బీటెక్ రవికి ఫోన్​ చేసి పలకరించిన చంద్రబాబు

By

Published : Jan 18, 2021, 11:02 PM IST

బెయిల్ పై విడుదలైన తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. వైకాపా దుర్మార్గాలపై రాజీలేని పోరాటం చేస్తున్నారని అన్నారు. పోరాడేవాళ్లే ప్రజల్లో హీరోలని పేర్కొన్నారు. పోరాటమే తెదేపా ఊపిరి అని చెప్పారు. బీటెక్ రవి భార్య, కొడుకు ఎంతో మనోధైర్యం చూపారని కొనియాడారు. వైకాపా అరాచకాలపై ప్రజలను చైతన్యపరిచి, అండగా ఉండాలని కోరారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో తెదేపాను అణగదొక్కలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.

ఇదీ చదవండి:ప్రవీణ్ చక్రవర్తితో నాకు ఎలాంటి పరిచయం లేదు: మంత్రి కన్నబాబు

ABOUT THE AUTHOR

...view details