ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెన్నుపాటి వ్యవహారంలో ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: చంద్రబాబు - చెన్నుపాటి వ్యవహారం

CHANDRABABU FIRES ON YSRCP : తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. గాంధీపై దాడి అమానుషమన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రౌడీమూకలు రెచ్చిపోతున్నారని.. ప్రశాంతంగా ఉన్న విజయవాడను కిష్కిందకాండగా మార్చరని మండిపడ్డారు. రౌడీయిజాన్ని నమ్ముకున్న వారు ఎవరూ బాగుపడలేదని.. దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గాంధీపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

CHANDRABABU FIRES ON YSRCP
CHANDRABABU FIRES ON YSRCP

By

Published : Sep 5, 2022, 4:14 PM IST

Updated : Sep 7, 2022, 10:14 PM IST

CBN FIRES ON YSRCP LEADERS: విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్‌, తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి వ్యవహారంలో దోషులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. చెన్నుపాటికి గాంధీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శనివారం విజయవాడలో వైకాపా నేతల దాడిలో చెన్నుపాటి కంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్ప్రతిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీని పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

ఖబడ్దార్‌.. ఇలాంటి ఘటన మరొకటి జరిగితే వదిలిపెట్టే సమస్యే లేదు

మీ కుటుంబాలకూ ఇదే పరిస్థితి వస్తే?:ఓడిపోతామనే పిరికితనంతో వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఖబడ్దార్‌.. ఇలాంటి ఘటన మరొకటి జరిగితే వదిలిపెట్టే సమస్యే లేదని ఆయన హెచ్చరించారు. కన్నుపొడవడం దుర్మార్గమని.. ఈ ఘటనలో దోషులకు శిక్ష పడే వరకు న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. విజయవాడలో గతంలో తెదేపా నేత పట్టాభిపై దాడి చేశారని, ఆ రోజు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చేసిన పని అని.. మీ కుటుంబాలకు ఇదే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు.

మాకు సొంత అజెండాలేమీ లేవు:తెదేపా కార్యకర్తలు పోరాడేది ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పైనేనని.. తమకు సొంత అజెండాలేమీ లేవని చంద్రబాబు అన్నారు. వైకాపా అరాచకాలపై ప్రజల్లో చైతన్యం ప్రారంభమైందని.. ప్రతిఘటించి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఎన్నో సంక్షోభాలను చూశామని.. దాడులు చేసిన వారిని పతనావస్థకు తీసుకెళ్లిన పార్టీ తెదేపా అన్నారు. చెన్నుపాటి గాంధీపై దాడి ఘటన ఎమోషన్‌లో జరిగిందని పోలీసులు చెబుతారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యారాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే: విజయవాడలో తెలుగుదేశం నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా శ్రేణులు దాడి చేశాయి. పటమటలంకలోని గర్ల్స్‌ హైస్కూల్ వద్ద గాంధీని వైకాపా వర్గీయులు చితక బాదారు. కంటికి తీవ్ర గాయాలు కాగా ఆయన్ను తాడిగడప ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. వైకాపా వర్గీయులు, దేవినేని అవినాష్ మనుషులే దాడి చేశారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తొమ్మిదో డివిజన్ నుంచి చెన్నుపాటి గాంధీ భార్య కార్పొరేటర్​గా పోటీ చేసి గెలుపొందారు. వైకాపా నుంచి ఓడిపోయిన అభ్యర్థి మద్యం మత్తులో కావాలని గొడవ పడ్డారని.. వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, వైకాపా నాయకులు గద్దె కళ్యాణ్, సుబ్బు, మరో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని తెదేపా నాయకులు ఆరోపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 7, 2022, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details