తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు(chandrababu) మండిపడ్డారు. ప్రతి కేసుకు, దాడికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. వైకాపా రౌడీలు తెగబడుతుంటే.. పోలీసులేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కుల్ని హరించేలా పోలీసుల తీరుందని ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల పోస్టులపై అరెస్టును సుప్రీం తప్పుబట్టిందని చంద్రబాబు గుర్తుచేశారు.
సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని.. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్‌ను.. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కుటుంబ సభ్యులకు ఆచూకీ తెలపకుండా తిప్పటాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. సందీప్‌పై వేధింపులు ఆపి, తక్షణమే విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆక్షేపించారు. రాజ్యాంగం విధించిన లక్షణ రేఖను పోలీసులు మీరితే శిక్షలు తప్పవని హెచ్చరించారు.