Chandrababu fires on CM Jagan: తన పంతమే ఫైనల్ కాదని, న్యాయవ్యవస్థ అనేది ఒకటి ఉందనే విషయాన్ని జగన్ రెడ్డి గుర్తించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హితవు పలికారు. వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను.. జగన్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. న్యాయబద్ధంగా జరిగిన ఏ ఎన్నిక ఫలితాన్ని అంగీకరించేందుకు సీఎం సిద్ధంగా లేరనే విషయం.. కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికతో రుజువైందన్నారు. ఇప్పటికైనా చట్టాలు, నిబంధనలకు లోబడి పని చేయడం జగన్ నేర్చుకోవాలని సూచించారు.
కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికపై హైకోర్టు తీర్పు జగన్కు చెంపపెట్టు: చంద్రబాబు - కొవ్వూరు అర్బన్ బ్యాంకు
Kovvur cooperative Bank: కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వాగతించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలను రద్దు చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన జగన్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. తన పంతమే ఫైనల్ కాదని.. న్యాయ వ్యవస్థనేది ఉందనే విషయం జగన్ రెడ్డి గుర్తించాలని హితవు పలికారు.
CBN ON JAGAN
కొవ్వూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును చంద్రబాబు స్వాగతించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికను రద్దు చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన జగన్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదని విమర్శించారు. బ్యాంక్ పాలక వర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: