ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాడు-నేడు అంటే లక్షలాది విద్యార్థులు ఫెయిల్ కావడమేనా ?: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్

Babu on SSC Results: పరీక్షల్లో తప్పామని ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని పదో తరగతి విద్యార్థులకు చంద్రబాబు విజ్ఞప్తి చేసారు. వ్యవస్థలో లోపాలకు మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక్కడ ఫెయిల్ అయ్యింది ప్రభుత్వ వ్యవస్థలే తప్ప విద్యార్థులు కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలే నేటి పరిస్థితికి కారణమన్నారు.

నాడు-నేడు అంటే లక్షలాది విద్యార్థులు ఫెయిల్ కావడమేనా ?
నాడు-నేడు అంటే లక్షలాది విద్యార్థులు ఫెయిల్ కావడమేనా ?

By

Published : Jun 7, 2022, 7:30 PM IST

CBN: నాడు-నేడు అంటే లక్షలాది విద్యార్థులు ఫెయిల్ కావడమేనా ? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాడు-నేడు పేరుతో మూడేళ్లుగా ప్రభుత్వం ప్రచారం ఆర్బాటం చేసిందని.. ప్రచారానికి పదో తరగతి ఫలితాలకు పొంతనే లేదని దుయ్యబట్టారు. తెదేపా హయాంలో 90-95 శాతం ఉత్తీర్ణత ఉండేదని గుర్తు చేశారు. ఉత్తీర్ణత 67 శాతానికి పడిపోవడం విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలే నేటి పరిస్థితికి కారణమని ఆక్షేపించారు.

పరీక్షల్లో తప్పామని విద్యార్థులు ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేసారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలన్నారు. వ్యవస్థలో లోపాలకు మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకపోవటం, వారికి బోధనేతర పనులు అప్పగించడం, బడుల విలీనం సహా ప్రభుత్వం తీసుకున్న పలు అస్తవ్యస్థ విధానాలే నేటి ఈ పరిస్థితికి కారణమని దుయ్యబట్టారు. ఇక్కడ ఫెయిల్ అయ్యింది ప్రభుత్వ వ్యవస్థలే తప్ప విద్యార్థులు కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details