విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో చెరకు బకాయిలు చెల్లించాలని నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అరాచకాలు రోజుకోజుకీ పేట్రేగి పోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంలో అన్నదాతలపై అక్రమ కేసులు సిగ్గుచేటన్నారు.
బకాయిలు చెల్లించాలని కోరిన రైతులపై కేసులు పెట్టడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్యాయానికి గురైన రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే.. నియంతలా వ్యవహరించటం సరికాదని హితవు పలికారు.