తెదేపా నేతల గృహనిర్భందాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. తమ కార్యకర్తల నిరసనలను అడ్డుకోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నిన్నటిదాకా ఎస్సీలపై దాడులు చేశారని.., ఇప్పుడు బీసీలపై దాడులకు తెగించారని ధ్వజమెత్తారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం పరాకాష్టకు చేరిందన్న చంద్రబాబు..., అసెంబ్లీ సమావేశాల ముందు తమ పార్టీ ఉపనేత అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ పిరికితనానికి నిదర్శనమన్న ఆయన..., అసెంబ్లీలో అచ్చెన్నకు భయపడే అక్రమ అరెస్ట్ చేశారని ఆరోపించారు.
వైకాపా ప్రభుత్వ టెర్రరిజం పరాకాష్టకు చేరింది: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్
నిన్నటిదాకా ఎస్సీలపై దాడులు చేశారని.., ఇప్పుడు బీసీలపై జగన్ దాడులకు తెగించారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ జగన్ పిరికితనానికి నిదర్శనమన్న ఆయన..., అసెంబ్లీలో అచ్చెన్నకు భయపడే అరెస్ట్ చేశారని ఆరోపించారు. తెదేపా నేతల గృహనిర్భందాన్ని ఖండించిన చంద్రబాబు... ధైర్యంగా పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వైకాపా ప్రభుత్వ టెర్రరిజం పరాకాష్టకు చేరింది: చంద్రబాబు
అసెంబ్లీలో జగన్ అవినీతిని నిలదీస్తాడనే భయంతోనే అచ్చెన్నను అరెస్ట్ చేశారన్నారు. ఇసుకలో వైకాపా దందాలు, గనులు బలవంతంగా లాక్కుకోవటం, మద్యం మాఫియా, భూసేకరణలో 1600 కోట్ల అవినీతి ఇవన్నీ ప్రశ్నిస్తారనే భయంతోనే అచ్చెన్నాయుడి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కార్యకర్తలందరూ ధైర్యంగా పోరాడాలని, అచ్చెన్న కుటుంబానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.