ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య మృతి.. చంద్రబాబు సంతాపం - chandrababu expressed condolence over freedom fighter pavuluri death

స్వాతంత్య్ర సమరయోధులు పావులూరి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

cbn condolences to freedom fighter pavuluri
పావులూరి మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు

By

Published : May 4, 2021, 9:04 PM IST

స్వాతంత్య్ర సమరయోధులు పావులూరి శివరామకృష్ణయ్య మృతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాంధేయవాదంతో నేటి తరానికి శివరామకృష్ణయ్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియడారు. నిరంతర ప్రజా సేవకుడిగా, సాంఘిక సంస్కర్తగా, ముక్కుసూటి ప్రవర్తన కలిగిన మనిషిగా మన్ననలందుకున్నారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

మహాత్మా గాంధీతో పాటు ఆయన ఆశ్రమంలో ఉన్న వ్యక్తుల్లో ఒకరైన శివరామకృష్ణయ్య సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని పేర్కొన్నారు. రైతు బాంధవుడిగా పేరు గడించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తెదేపా అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details