తెలుగు ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభాగ్యాలతో అంతా కలిసిమెలిసి ఉండాలన్నది దసరా సందేశమన్న ఆయన...మహార్నవమి, విజయదశమి పర్వదినాలు ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నింపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్నారు.
అరాచక శక్తుల స్వైర విహారాన్ని దుర్గామాత సహించదన్న చంద్రబాబు...దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే అమ్మవారి ఆగ్రహనికి గురవక తప్పదని హెచ్చరించారు.