కాకినాడలో దేవిక హత్య విషయంలో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ స్వయంగా సీఎం ప్రకటనలు చేయడం మోసగించడమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రకటనలకే పరిమితం అవుతుందని మండిపడ్డారు. సీఎం, ప్రభుత్వం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలు మాని, నిందితులకు వెంటనే శిక్షపడేలా చూడాలన్నారు. అప్పుడే నేరస్థులకు భయం, మహిళలకు నమ్మకం కలుగుతుందన్నారు.
ఉత్తుత్తి ప్రకటనలు మాని.. నిందితుడికి శిక్షపడేలా చూడండి:చంద్రబాబు - కాకినాడలో దేవిక హత్యపై చంద్రబాబు స్పందన
కాకినాడ జిల్లాలో దేవిక హత్య కేసులో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం ప్రకటనలు చేయడం మోసగించడమేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం ఉత్తుత్తి ప్రకటనలు మాని, నిందితులకు వెంటనే శిక్షపడేలా చూడాలన్నారు. కొత్త చట్టాలు కాదు, కనీసం ఉన్నచట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు
కొత్త చట్టాలు కాదు... కనీసం ఉన్నచట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసుపెట్టిన వివాహిత ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని మండిపడ్డారు. హిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం అలసత్వానికి ఇదే నిదర్శనమన్నారు
ఇవీ చదవండి:
Last Updated : Oct 9, 2022, 2:09 PM IST