ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ChandraBabu: జగన్​ రెండేళ్ల పాలనలో 20 ఏళ్ల విధ్వంసం జరిగింది: చంద్రబాబు - తెదేపా తాజా సమాచారం

న్యూజిలాండ్​లో జరిగిన తెదేపా మహానాడులో వర్చువల్ విధానంలో తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu) పాల్గొన్నారు. వైకాపా రెండేళ్ల పాలనలో 20ఏళ్ల విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను ముందుగా గుర్తించటంలో జగన్​ పూర్తిగా విఫలమయ్యారన్నారు.

chandrababu
చంద్రబాబు

By

Published : May 30, 2021, 7:11 PM IST

జగన్ రెండేళ్ల పాలనతో 20ఏళ్ల విధ్వంసం జరిగిందని... అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి పోయామని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌లో జరిగిన తెదేపా మహానాడు కార్యక్రమాంలో చంద్రబాబు వర్చువల్​గా పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు పలు అంశాలపై ఎన్నారైలతో ఆయన చర్చించారు. సమస్యలను ముందస్తుగా గుర్తించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని.. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్‌తో కరోనా మాయమవుతుందని చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు. నేడు ప్రపంచానికి కొవాగ్జిన్​ టీకాను అందిస్తున్న భారత్ బయోటెక్ సంస్థను తమ హయాంలోనే తీసుకువచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details