పరిశ్రమ లాంటి తెలుగుదేశం పార్టీలో నాయకులుగా తయారై.. అనంతరం పార్టీని వీడుతున్న వారిపై చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. నమ్మి పదవులు ఇస్తే.. నమ్మకద్రోహం చేసి వెళ్లారని ధ్వజమెత్తారు. పార్టీలో ఉండి రాజకీయ భవిష్యత్ పొందినవారు నేడు తనపై విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు.
'నమ్మి పదవులు ఇస్తే.. నమ్మకద్రోహం చేసి వెళ్లారు'
కొందరు వ్యక్తులకు నమ్మి పదవులు ఇస్తే.. నమ్మక ద్రోహం చేసి వెళ్లారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేపాతో రాజకీయ జీవితం పొంది.. నేడు వేరే పార్టీల్లో చేరుతూ.. తనపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మహానాడులో చంద్రబాబు
రెండో రోజు మహానాడు కార్యక్రమంలో మాట్లాడుతూ.. పార్లమెంట్ వారీగా కమిటీలు వేస్తూ అనుబంధ సంస్థలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. జిల్లా కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాలన్న ఆయన... యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించనున్నట్లు ప్రకటించారు. భవిష్యత్ నాయకత్వాన్ని పటిష్ఠ పరిచేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి... 'ఎన్టీఆర్... వ్యక్తి కాదు వ్యవస్థ'
Last Updated : May 28, 2020, 6:36 PM IST