కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలో తెదేపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి యనమల సుధాకర్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అంతకుముందు.. సుధాకర్‌పై వైకాపా నాయకులు తప్పుడు కేసులు పెట్టడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి బీపీ లెవల్స్ తగ్గిపోవడంతో.. ఆసుపత్రి పాలయ్యాడు.
సర్పంచ్ అభ్యర్థిని పరామర్శించిన చంద్రబాబు - కడప న్యూస్
ఆసుపత్రి పాలైన కడప జిల్లా పోరుమామిళ్లలోని తెదేపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అంతకుముందు.. అతన్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. బీపీ లెవల్స్ తగ్గిపోవడంతో ఆసుపత్రి పాలయ్యాడు.
సర్పంచ్ అభ్యర్థిని పరామర్శించిన చంద్రబాబు
ఈ విషయాన్ని తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి.. స్థానిక నేతలు తీసుకెళ్లారు. అనంతరం సుధాకర్‌కు చంద్రబాబు ఫోన్ చేసి.. ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.