పద్మభూషణ్, పద్మశ్రీ సాధించిన తెలుగు వారికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. పీ.వీ.సింధుకు పద్మభూషణ్ అవార్డు రావడం యావత్ దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. యడ్ల గోపాలరావుకు పద్మశ్రీ.. సిక్కోలు కళలకే గొప్ప గౌరవమన్నారు. చలపతిరావుకు పద్మశ్రీ.. అనంతపురం జానపద కళలకే విశేష గుర్తింపు తెచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన రైతు చింతల వెంకటరెడ్డి, సాహితీవేత్త శ్రీ భాష్యం విజయసారథికి పద్మశ్రీ అవార్డుల రావడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించేందుకు దోహదపడాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
'సింధుకు పద్మభూషణ్.. యావత్ దేశానికే గర్వకారణం' - పీవీ సింధుకు పద్మ భూషణ్ న్యూస్
పద్మ అవార్డు గ్రహీతలకు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఐదుగురు తెలుగువారికి పద్మ పురస్కారాలు రావడం.. తెలుగు వాళ్లందరికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు.
chandrababu congratulated to padma Recipients