వైకాపా పనైపోయిందని వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని అన్నారు. పార్టీలో గ్రూపులకు చెక్ పడాల్సిందేనని.. ఎవరికీ మినహాయింపులు లేవని వెల్లడించారు. వైకాపా పాలనపై ప్రజల అసంతృప్తే.. మహానాడు గ్రాండ్ సక్సెస్‌కు కారణమని అన్నారు.
వైకాపా పనైపోయింది.. వచ్చే ఎన్నికలు ఏకపక్షమే: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు
Chandrababu on YSRCP: వైకాపా పాలనపై ప్రజల అసంతృప్తే.. మహానాడు గ్రాండ్ సక్సెస్‌కు కారణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చెప్పారు. వైకాపా పనైపోయిందని వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని వ్యాఖ్యనించారు.
వైకాపా పనైపోయింది.. వచ్చే ఎన్నికలు ఏకపక్షమే
ఒంగోలు నేతలు సమష్టి కృషితో మహానాడును సక్సెస్ చేశారన్న చంద్రబాబు.. ఈ నమూనాను అన్ని జిల్లాలు పాటించాలని సూచించారు. ఓట్ల తొలగింపు విషయంలో గ్రామ స్థాయిలో నేతలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యకర్తల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తెచ్చిన న్యూట్రిఫుల్ యాప్ సేవల గురించి ఆయన వివరించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలపై స్థానికంగా పోరాటం చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు.
ఇవీ చూడండి