ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసులతో కిడ్నాప్ చేయిస్తారా..?: చంద్రబాబు - chandrababu comments on jagan

మీడియాపై వైకాపా సర్కార్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ట్విట్టర్ వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. సొంతమీడియాలో ఎవరి మీదైనా, ఎంత అసత్య ప్రచారమైనా చేస్తుంటారని... కానీ ప్రజలకు ఏ మీడియా వాళ్ళైనా నిజాన్ని చెబితే వారి పై కక్షగట్టి, అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తారని చంద్రబాబు విమర్శించారు.

chandrababu comments on media cases
వైకాపా పై చంద్రబాబు విమర్శలు

By

Published : May 2, 2020, 5:40 PM IST

ప్రజలకు ఏ మీడియా వాళ్ళయినా నిజాన్ని చెబితే వైకాపా వాళ్ళు కుతకుతలాడిపోతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఆ మీడియా ప్రతినిధుల పై కక్షగట్టి, అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత మీడియాలో మాత్రం ఎవరి మీదయినా, ఎంత అసత్య ప్రచారమైనా చేసుకోవచ్చా అని నిలదీశారు. వైకాపా నేతల అక్రమాలకు సొంత మీడియాలో కట్టుకథలు అల్లి కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. మీడియా ప్రతినిధుల ఆచూకీ కోసం... వారి బంధువులు, మీడియాతో ఏమాత్రం సంబంధం లేని వారిని పోలీసులతో కిడ్నాప్ చేయించడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి అరాచకాల్ని తెలుగుదేశం ఖండిస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే వారిని వారి కుటుంబాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధం అవుతుందని హెచ్చరించారు. అవసరమైతే మానవహక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయిస్తామన్నారు. ప్రజా హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

వైకాపా పై చంద్రబాబు విమర్శలు

ABOUT THE AUTHOR

...view details