కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల ప్రాథమికోన్నత పాఠశాలలో భవనం పైకప్పు పెచ్చులు రాలి చిన్నారులు తీవ్రంగా గాయపడటం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఈఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. నాడు - నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం పాఠశాలల పునరుద్ధరణ కోసం చేసిందేమి లేదన్నారు. అందుకు ఈ ఘటనే ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. భవనం పరిస్థితిపై తల్లిదండ్రులు హెచ్చరించినా.. పట్టించుకోలేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని నిలధీశారు. ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్ల.. చదువుకుందామని బడికొచ్చిన చిన్నారులు రక్తం చిందించాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటన ప్రభుత్వానికి సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ చూపాలని కోరారు. అలాగే బాధిత చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్‌చేశారు. ఒక ఫుల్ పేజీ ప్రకటన కోసం వెచ్చించే డబ్బులతో ఎన్నో పనులు చేయవచ్చని హితవు పలికారు.
తల్లిదండ్రులు హెచ్చరించినా పట్టించుకోరా..?- చంద్రబాబు - పాఠశాలలో భవనం పైకప్పు పెచ్చులు రాలి విద్యార్థులకు గాయాలు
Chandrababu News: కర్నూలు జిల్లా గోనెగండ్లలోని పాఠశాలలో జరిగిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. పాఠశాల భవనం పైకప్పు పెచ్చులు పడి చిన్నారులు గాయపడిన ఘటనపై చంద్రబాబు విచారణ వ్యక్తం చేశారు. భవనం పరిస్థితిపై తల్లిదండ్రులు హెచ్చరించినా.. పట్టించుకోలేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని నిలధీశారు.
![తల్లిదండ్రులు హెచ్చరించినా పట్టించుకోరా..?- చంద్రబాబు చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15139407-892-15139407-1651139136594.jpg)
cbn on Kurnool School Incident