ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 27, 2021, 3:33 PM IST

ETV Bharat / city

సీఎంగా ఉండటానికి జగన్​రెడ్డి అనర్హుడు: చంద్రబాబు

గ్రామాల్లో యథేచ్ఛగా దోపిడీ చేసేందుకే వైకాపా ఏకగ్రీవాల జపం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అయన ... ఎప్పుడో 10 నెలల క్రితం ఇచ్చిన జీవోకు ఇప్పుడు ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడం మరో తుగ్లక్ చర్యగా అభివర్ణించారు.

సీఎంగా ఉండటానికి జగన్​ రెడ్డి అనర్హుడు: చంద్రబాబు
సీఎంగా ఉండటానికి జగన్​ రెడ్డి అనర్హుడు: చంద్రబాబు

ఎప్పటి జీవోకు ఇప్పుడు ఫుల్​ పేజీ యాడ్స్ ఇవ్వడం తుగ్లక్ చర్య అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెలంగాణ లోగో ఉన్న పంచాయతీ కార్యాలయ భవనం ఫొటో ముద్రించడం సిగ్గుచేటన్నారు. అధికార దుర్వినియోగానికి, ప్రజాధనం దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండటానికే జగన్​రెడ్డి అనర్హుడన్న చంద్రబాబు చేయని తప్పుడు పనిలేదు, పాల్పడని అరాచకం లేదని విమర్శించారు. తప్పుడు పనులకు, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్​గా జగన్​రెడ్డి మారారని ధ్వజమెత్తారు. ఈసీ శిక్షించిన అధికారులకు డబుల్ ప్రమోషన్లు ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి, అదే రాజ్యాంగం ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తి మంత్రి పదవికే అనర్హుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వైకాపా నాయకులు ఆంబోతుల్లా మారి రాష్ట్రంలో అభివృద్ధి అంతా నాశనం చేశారని ఈ ఆంబోతులకు పంచాయతీ ఎన్నికల్లో ముక్కుతాడు వేయాలని శ్రేణులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిపేయాలని ప్రభుత్వ మద్యం దుకాణాలను, లిక్కర్ షాపులను మూసేయాలన్నారు. వైకాపా మొబైల్ బెల్ట్ షాపులను నిలిపేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details