ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అల్లూరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం దేశానికే గర్వకారణం: చంద్రబాబు - ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో అల్లూరిని స్మరించుకోవడం గర్వకారణం

CBN ON ALLURI JAYANTHI: అల్లూరి జయంతి ఉత్సవాల నిర్వహణకు కేంద్రం ముందుకు రావడం శుభపరిణామమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని నిర్ణయాన్ని పార్టీపరంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. పార్లమెంటులోనూ అల్లూరి విగ్రహాన్ని పెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు.

CBN ON ALLURI JAYANTHI
అల్లూరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం దేశానికే గర్వకారణం

By

Published : Jul 4, 2022, 10:28 AM IST

CBN ON ALLURI JAYANTHI: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సావాలు జరుపుకోవడం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చిన్న వయసులోనే బ్రిటీష్ వారిని గడగడలాడించి.. గిరిజనులందరినీ సమీకరించి సాయుధ పోరాటంతో ముందుకు సాగరని కొనియాడారు. అల్లూరి పోరాటం తట్టుకోలేక బ్రిటిష్ వారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంతమొందించారని తెలిపారు. 27 సంవత్సరాల వయసులోనే బ్రిటీష్ వారు అంతమొందించినా.. ఆయన పోరాటం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయిందని గుర్తు చేశారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించటం శుభపరిణామని తెలిపారు. ప్రధాని నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా స్వాగతిస్తున్నామన్నారు. పార్లమెంట్​లో అల్లూరి విగ్రహం పెట్టాలని కోరారు.

అల్లూరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం దేశానికే గర్వకారణం

LOKESH:నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతున్న గిరిజనుల్లో ధైర్యం నింపిన ఉత్తేజం అల్లూరి సీతారామరాజు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనియాడారు. స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటీష్‌ వారి గుండెల్లో దడపుట్టించిన మన్యం వీరుడు అల్లూరిని ఆజాది కా అమృత మహోత్సవ్​లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణమన్నారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details