ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపాలో సమస్యల పరిష్కారానికి.. ఆ కమిటీకే బాధ్యతలు' - Chandrababu appointed a committee to resolve the differences between the leaders in TDP

TDP committee met Babu: తెదేపాలో నేతల మధ్య నెలకొన్న విబేధాల పరిష్కారం కోసం చంద్రబాబు ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యలు నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో సమావేశమయ్యారు. నేతల మధ్య విభేదాలు, సమన్వయలోపం వంటి సమస్యలు పరిష్కరించేలా కమిటీకి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు.

TDP leaders
TDP leaders

By

Published : Jun 23, 2022, 5:00 PM IST

తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారం కోసం సీనియర్ నేతలతో అధినేత చంద్రబాబు నియమించిన కమిటీ భేటీ అయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు బచ్చుల అర్జునుడు, యనమల రామకృష్ణుడు, టి.డి.జనార్దన్, దామచర్ల సత్య లతో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. నేతల మధ్య విబేధాలు, సమన్వయలోపం వంటి సమస్యలు పరిష్కరించేలా కమిటీకి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. పార్టీ క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకునేందుకు కమిటీకి అధికారాలు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details