రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఏడాదిలో పండుగలన్నీ తొలి ఏకాదశి నుంచే మొదలవుతాయన్నారు. రుతుపవనాల ఆగమనం వేళ, వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవతలకు ప్రత్యేక పూజలు, చాతుర్మాస దీక్షలు చేసే భక్తుల ఆకాంక్షలు ఫలించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తొలి ఏకాదశితో పండుగలే కాదు, వానలు కురిసి వ్యవసాయ పనులు కూడా ఊపందుకుంటాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara lokesh) అన్నారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం రైతుకు ఇవ్వాల్సిన కొనుగోలు బకాయిలు ఇచ్చేస్తే సాగుకు సాయంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈసారైనా అన్నదాతకు లాభం చేకూర్చేలా మద్దతు ధర అందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.