Chandrababu Tribute to Potti Sriramulu: వైకాపా ప్రభుత్వం వ్యాపారులను తీవ్రంగా వేధిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు నిత్యం స్మరణీయులని చంద్రబాబు కొనియాడారు.
రోశయ్యకు అంజలి ఘటించేందుకూ జగన్‌కు మనసు రాలేదని, తెదేపా అధికారంలోకి వచ్చాక రోశయ్యకు తగిన గౌరవం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే.. తమపై వేధింపులు జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య నేతలు వాపోయారు.