Chandrababu Tributes To Ambedkar: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్విట్టర్లో ఆయనకు నివాళులు అర్పించారు చంద్రబాబు. భవిష్యత్ తరాల కోసం, బడుగు జీవుల రక్షణ కోసం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరిపేలా వ్యవస్థలు, ప్రభుత్వాలు పని చేయాలని కోరారు. ఆ మహాశయుని జీవితాన్ని రేపటి తరాలు అధ్యయనం చేయాలన్న ఆలోచనతోనే ప్రజా రాజధాని అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనానికి తెదేపా హయాంలో శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేసుకున్నారు. దళితుల ఆత్మగౌరవం నిలిపేది.. వారి జీవితాల్లో వెలుగులు నింపేది తెలుగు దేశం మాత్రమేన్నారు చంద్రబాబు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ స్థాపనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.
Dr. B.R. Ambedkar: 'అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ స్థాపనకు పునరంకితమవుదాం' - Chandrababu Tributes To Ambedkar
Tributes To Ambedkar: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ నివాళులు అర్పించారు.
Lokesh Tributes To Ambedkar : అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్ జన్మించిన రోజు.. భారతదేశానికి పండగ రోజని నారా లోకేశ్ అభివర్ణించారు. అణగారినవర్గాల హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు, తత్వవేత్త అయిన అంబేడ్కర్ మహాశయుని ఆశయాల సాధనకు కృషి చేయడం మన బాధ్యతని సూచించారు.
ఇదీ చదవండి :Fake Certificates: విదేశాల్లో ఉద్యోగాలకు నకిలీ పత్రాలు.. విజయవాడలో మూలాలు