ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం: చంద్రబాబు - పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వార్తలు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ అమరులైన వారికి నివాళులు అర్పించారు. బాధ్యతాయుతమైన సేవలు అందించే పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియడారు.

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం: చంద్రబాబు
పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం: చంద్రబాబు

By

Published : Oct 21, 2020, 12:04 PM IST

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో పోలీసు పాత్ర కీలకమని చంద్రబాబు అన్నారు. అరాచక శక్తులను అణచివేసే ప్రయత్నంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ఎందరో పోలీసులు ప్రజల హృదయాల్లో చిరంజీవులై నిలిచారని గుర్తుచేశారు. విశ్వకవి ఠాగూర్ చెప్పినట్లు స్వేచ్ఛా స్వర్గాన్ని సమాజానికి అందించేది పోలీసులేనని లోకేష్ అన్నారు. నిస్వార్థమైన, అంకిత భావంతో కూడిన సేవలందిస్తూ ప్రాణాలర్పించిన త్యాగధనులందరి సేవలు చిరస్మరణీయమన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details