సాహితీవేత్త, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మృతి పట్ల.. తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. తెలుగు రచనా రంగంలో వెలుగొందిన ఎండ్లూరి సుధాకర్ మృతి సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. ఉత్తేజ పూరిత రచనలతో సమాజంపై ఎండ్లూరి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. దళిత రచయితగా సుధాకర్ రచనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయని గుర్తు చేశారు. తెలుగు ఆచార్యుడిగా ఎందరో విద్యార్థులు, పరిశోధకులకు మార్గనిర్దేశం చేశారన్నారు.
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. తెలుగు భాషా, సాహిత్య రంగాలకు ఆయన మృతి తీరని లోటని అన్నారు. పాఠాలతో విద్యార్థులను, రచనలతో సమాజాన్ని చైతన్యపర్చారని గుర్తు చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.