ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Wishes: గురువులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్ - టీటర్స్​ డే శుభాకాంక్షలు తెలిపిన తెదేపా అధినేత చంద్రబాబు

టీచర్స్​ డే సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. తమ బోధనలతో జాతి వికాసానికి పాటుపడుతున్న గురువులందరికీ.. తెదేపా అధినేత చంద్రబాబు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఎదగడానికే కాదు, మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుందని నారా లోకేశ్ అన్నారు.

chandrababu and lokesh greets on teachers day
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్

By

Published : Sep 5, 2021, 12:49 PM IST

ఉపాధ్యాయ దినోత్సవం(teacher's day) సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(lokesh) శుభాకాంక్షలు తెలిపారు.

గురువుకే మొదటి నమస్కారం: చంద్రబాబు

తమ బోధనలతో జాతి వికాసానికి పాటుపడుతున్న గురువులందరికీ.. తెదేపా అధినేత చంద్రబాబు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే తాను మొదట గురువుకే నమస్కరిస్తానని.. కబీర్ దాస్ మాటలను గుర్తుచేశారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్(sarvepalli radhakrishnan) జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పించారు.

వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో ఉపాధ్యాయుల ప్రభావం ఎక్కువే: లోకేశ్

జీవితంలో ఎదగడానికే కాదు, మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అటువంటి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా.. ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుంటూ, గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాధ్యాయ కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించాలి

కరోనా కారణంగా రాష్ట్రంలో చాలా మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కూలీ పనులకు కూడా వెళ్తున్నారని, వారికి ప్రభుత్వం ఏ సాయమూ చేయలేదని మండిపడ్డారు. ఇంకోవైపు చూస్తే మొదటి ఏడాదే మెగా డీఎస్సీ అన్న పెద్దమనిషి.. ఇంతవరకు ఆ మాటే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను గౌరవించి, పూజించే సంస్కారం ఈ ప్రభుత్వానికి ఎలాగూ లేదని, కనీసం వారికి ఆకలి బాధలు లేకుండా చేస్తే అదే పదివేలన్నారు. కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఏమిస్తారో ఈ రోజైనా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తెరతో మెడపై దాడి..

ABOUT THE AUTHOR

...view details