Chandrababu: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మరణవార్త తెలిసి చాలా బాధపడ్డానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. జైన్ నాదెళ్ల మరణవార్త తనను ఎంతగానో కలచి వేసిందని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ అన్నారు. సత్యనాదెళ్ల కుటుంబ సభ్యులకు.. చంద్రబాబు,లోకేశ్ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నామన్నారు. ఈమేరకు చంద్రబాబు ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
జైన్ నాదెళ్ల(26) మృతి
Satya Nadella son died: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అతను కన్నుమూశాడు. పుట్టుకతోనే జైన్ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో(సెరెబ్రల్ పాల్జీ) బాధపడుతున్నాడు. జైన్ మరణవార్తను సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఎక్జిక్యూటివ్ సిబ్బందికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది.
Zain Nadella News: 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కుమారుడు జైన్‌ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను వివరించేవారు.
ఇదీ చదవండి:సత్య నాదెళ్ల ఇంట తీవ్ర విషాదం- 26 ఏళ్ల కుమారుడు కన్నుమూత