ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 5, 2022, 1:17 PM IST

ETV Bharat / city

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. కేసీఆర్​ జాతీయ పార్టీపై ఏమన్నారంటే?

DUSSEHRA WISHES : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటితో ఉత్సవాలు ముగియనున్నాయి. అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని.. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

DUSSEHRA WISHES
DUSSEHRA WISHES

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

DUSSEHRA WISHES TO PEOPLE : బెజవాడ దుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో చంద్రబాబుకు అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో సకల జనులకు మంచి జరగాలని కోరుకున్నారు. దుర్గమ్మ కరుణాకటాక్షాలు ఏపీ ప్రజలపై ఉండాలని.. రాష్ట్రం సుభిక్షమై, సుసంపన్నమై వెలిగే రోజులు రావాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీపై ప్రకటనపై మీడియా ప్రతినిధులు చంద్రబాబు స్పందన కోరగా.. ఓ నవ్వు నవ్వి అక్కడ నుంచి ఆయన వెళ్లిపోయారు.

"అమరావతి రాష్ట్ర ప్రజలందరి సంకల్పం.. దేవతల ఆశీర్వాదం. రాజధాని అమరావతిపై రోజుకోమాట తగదు. దుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి. విజయదశమి రోజు ఏ కార్యక్రమమైనా ముహూర్తంతో పని ఉండదు. దుష్టశక్తులను తుదముట్టించే శక్తి దుర్గమ్మకు ఉంది. మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదు. ప్రజా సంకల్పం, దుర్గమ్మ ఆశీస్సులతో రాజధాని ప్రకటించాం"- చంద్రబాబు

LOKESH DUSSEHRA WISHES : ప్రజలందరికీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని.. దుర్గమ్మ ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నారు.

BALAKRISHNA DUSSEHRA WISHES : విజయవాడలో దుర్గమ్మను సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. లోకమంతా శాంతియుతంగా ఉండి.. అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. అమ్మవారి కరుణ కటాక్షాలు భక్తులపై ఉండాలని.. సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలిగేలా అమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాక్షించారు. రాష్ట్రాభివృద్ధి జరిగేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని.. చెడుపై మంచి.. అధర్మంపై ధర్మం సాధించిన విజయమన్నారు. ఇవాళ ప్రారంభించే ఏ పనైనా విజయవంతమవుతుందనేది భక్తుల విశ్వాసమన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details