కర్నూలు జిల్లా పెసరవాయిలో తెదేపా నాయకుల హత్యను పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు అన్నారు. తెదేపా కార్యకర్తలను హతమారుస్తున్నారు అని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా లేదా అన్న అనుమానం కలుగుతోందన్న తెదేపా అధినేత.. కర్నూలు జిల్లా పెసరవాయిలో కారుతో ఢీకొట్టి చంపడం దారుణమని మండిపడ్డారు.
'హత్యల వెనక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి హస్తం ఉంది. ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? వైకాపా అధికారంలోకి వచ్చాక 30 మంది తెదేపా కార్యకర్తలు హత్యకు గురయ్యారు. హత్యాకాండకు వైకాపా ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత. రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోకతప్పదు. మృతుల కుటుంబాలకు తెదేపా అండగా నిలుస్తుంది' అని చంద్రబాబు అన్నారు.
'తెదేపా శ్రేణులే లక్ష్యంగా దాడులు'