ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పల్లెల్లో ప్రశాంతత నెలకొంటేనే గ్రామస్వరాజ్యం సాధ్యం' - గాంధీ వర్ధంతి వార్తలు

గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపిత బోధనలను స్మరించుకుందామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పల్లెలు స్వయం సమృద్ధితోనే గాంధీ ఆశించిన గ్రామస్వరాజ్యం సాధ్యమని చంద్రబాబు అన్నారు.

chandrababu and lokesh about gandhiji
chandrababu and lokesh about gandhiji

By

Published : Jan 30, 2021, 10:08 AM IST

గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్ముడిని తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్మరించుకున్నారు. వైకాపా పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. కక్షలు, కబ్జాలు, ఆక్రమణలతో పల్లెలు అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అహింస, సత్యాలతో విజయం సాధించిన మహనీయుడు గాంధీజీ అని నారా లోకేశ్ అన్నారు. హింసా రాజకీయాలను నమ్ముకున్నవారు ఏం సాధించినా తాత్కాలికమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details