ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బినామీల కోసమే చంద్రబాబు అమరావతి ఉద్యమం' - చంద్రబాబు అమరావతి న్యూస్

రాయలసీమ వాసుల ఆత్మాభిమానాన్ని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని దెబ్బతీసేందుకే అమరావతి ఉద్యమం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్​ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తన బినామీల కోసమే చంద్రబాబు అమరావతి ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు.

'బినామీల కోసమే చంద్రబాబు అమరావతి ఉద్యమం'
'బినామీల కోసమే చంద్రబాబు అమరావతి ఉద్యమం'

By

Published : Dec 15, 2020, 8:04 PM IST

అమరావతి ఉద్యమం..రాయలసీమ, ఉత్తరాంధ్ర వ్యతిరేక ఉద్యమమని ప్రభుత్వ చీఫ్​ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాయలసీమ వాసుల ఆత్మాభిమానాన్ని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని దెబ్బతీసేందుకే ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమం వల్ల అమరావతి అభివృద్ది కూడా దెబ్బతింటోదని వ్యాఖ్యానించారు. తన బినామీల కోసమే చంద్రబాబు అమరావతి ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంత అభివృద్దిని విస్మరించారని దుయ్యబట్టారు. అమరావతిలో పేదలు ఎవరూ ఉండకూడదని, వారి బినామీలు మాత్రమే ఉండాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.

ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లోని పేదలకు అమరావతిలో 50 వేల ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే...న్యాయ స్థానాల్లో కేసులు వేసి స్టేలు తెచ్చారన్నారు. ఒకే రాజధాని కావాలంటోన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారో చదువుకోవాలని హితవు పలికారు. కర్నూలులో హైకోర్టు పెడతామని భాజపా మేనిఫెస్టోలో చెప్పడం నిజం కాదా? అని ప్రశ్నించారు. శాసన రాజధానిగా అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్యాకేజీ ఇచ్చిన తర్వాత భాజపా నేతలు మాట్లాడితే బాగుంటుందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details