కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇళ్లపైనే తెదేపా జెండాలు ఎగరేసి.. ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించాలని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. సామాజిక బాధ్యత ఉన్న పార్టీ అని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనేది తెదేపా సిద్ధాంతమని గుర్తు చేశారు. కరోనా మహమ్మారితో దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయన్న చంద్రబాబు.. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా తెదేపా కార్యకర్తలు పనిచేయాలని ట్వీట్ చేశారు.
'బయటకు రావొద్దు..ఇళ్లపై తెదేపా జెండా ఎగరేయాలి' - తెదేపా ఆవిర్భావ దినోత్సవం న్యూస్
తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం ఇళ్లలోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
'బయటకు రావొద్దు..ఇళ్లపై తెదేపా జెండా ఎగరేయాలి'