ప్రజల ప్రాణాలు కాపాడిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పదవినుంచి తొలగించడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలు రెడ్‌జోన్‌లోకి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. కరోనా మరణాలు దాచిపెట్టడం వల్ల మరింత కీడు వాటిల్లుతోందని హెచ్చరించారు. కరోనా వ్యాప్తిని జిల్లా ప్రాతిపదికగా విశ్లేషించాలని చంద్రబాబు సూచించారు. లాక్‌డౌన్‌లోనూ వైకాపా నేతలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని.. పిఠాపురం, పెద్దాపురంలో గ్రావెల్, మట్టి, ఇసుక రవాణా చేస్తున్నారన్నారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నారాయణస్వామిని బర్తరఫ్ చేయాలన్న తెదేపా అధినేత... కరోనా మహమ్మారిని ఒక మతానికి అంటగట్టాలని చూడటం సరికాదన్నారు.
'ప్రజల ప్రాణాలు కాపాడితే.. పదవి నుంచి తొలగించారు' - నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై చంద్రబాబు ఆగ్రహం న్యూస్
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగింపును తీవ్రంగా ఖండిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదావేసి ప్రజల ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు.
chandrababu about nimmagadda ramesh kumar