గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆ మహాకవి సాహితీసేవను స్మరించుకుందామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గురజాడ రచనలు చదివితే ఆయన తన కాలాన్ని దాటి ఎంత ముందుకు చూడగలిగారో అర్థమవుతుందని చంద్రబాబు కొనియాడారు. 'ఒట్టి మాటలు కట్టిపెట్టవోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్' అన్న గురజాడ మాటలు ప్రజాసేవలో ఉన్నవారికి ఒక స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.
సాహిత్యం అనేది కాలక్షేపానికి కాదని, సమాజాన్ని సంస్కరించి ముందడుగు వేయించే ఒక ఆయుధమని చాటిన మహనీయుడు గురజాడ అప్పారావు అని లోకేశ్ కీర్తించారు. ముఖ్యంగా స్త్రీలకు మద్దతుగా నిలిచి వారి సమస్యలను వెలుగులోకి తేవడంలో ఆయన కృషి అనితర సాధ్యమని గుర్తు చేశారు.