పండగపూట రైతుల నిరాహార దీక్ష బాధాకరమని.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అన్నదాత పస్తులు ఉండటం సమాజానికి మంచిది కాదని చెప్పారు. పేదలను పండగపూట పస్తులు ఉంచడమే నవశకమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంక్రాంతివేళ కళకళలాడాల్సిన రైతు లోగిళ్లు.. పంటలకు గిట్టుబాటు ధరలేక వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంలో అన్నదాతలను పస్తులుపెట్టిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర సృష్టించారని చంద్రబాబు ట్వీట్ చేశారు.
'పేదలను పండగ పూట పస్తులు ఉంచడమే నవశకమా?' - అమరావతి ఉద్యమం
సంక్రాంతి నాడు రైతులు, రైతు కూలీలు, మహిళలు సామూహిక నిరాహార దీక్షలు చేయడం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలను పండగపూట పస్తులు ఉంచడమే నవశకమా?:చంద్రబాబు