ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మానవత్వం మరిచి.. సమస్యలు సృష్టిస్తున్నారు' - కరోనాపై చంద్రబాబు కామెంట్స్

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో మానవత్వం మరచి.. సమస్యలు సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రాజకీయ విన్యాసాలతో పైశాచిక ఆనందం పొందుతుందన్నారు.

chandrababu about corona virus
chandrababu about corona virus

By

Published : Aug 3, 2020, 10:39 PM IST

కరోనా భయంతో ధర్మవరంలో దంపతుల ఆత్మహత్య, ఇంట్లో వాళ్లు రానీయడం లేదని విజయవాడలో ఆసుపత్రి పైనుంచి దూకి మరొకరు మరణించడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. పొక్లెయిన్లతో మృతదేహాల తరలింపు, చెత్త తరలించే వాహనాల్లో కరోనా బాధితులను తీసుకెళ్లడం లాంటి సంఘటనలు కలచి వేస్తున్నాయన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యమన్న చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వం రాజకీయ విన్యాసాలతో పైశాచిక ఆనందం పొందుతుందని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details