అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం దిగ్గజ నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. మూడు సార్లు ముఖ్యమంత్రి, ఆరుసార్లు ఎంపీగా పనిచేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా అసోం రాష్ట్ర అభివృద్దికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గొగోయ్ మృతి పట్ల పలువురు పార్టీ నాయకులు, తదితరులు సంతాపం ప్రకటించారు.
'దేశం సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నేతను కోల్పోయింది' - తరుణ్ గొగోయ్ మృతి పట్ల పలువురి సంతాపం
దేశం సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నేతను కోల్పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
!['దేశం సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నేతను కోల్పోయింది' cbn condolence to tarun gogoi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9641816-241-9641816-1606150630598.jpg)
దేశం సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నేతను కోల్పోయింది
TAGGED:
farmer cm tarun gogoi dies