ప్రజల ఆమోదంతో రాష్ట్రంలో ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేసినా తాను అడ్డురానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలోని వేదిక కల్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని మండిప్డడారు. విజయవాడలో రాజధాని పెట్టాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని తెలిపారు. అమరావతిలో దాదాపు రూ.10,500 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని ఆరోజు జగన్ చెప్తే.... 54 వేల ఎకరాలు సేకరించిన ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు.రాజధాని కోసం ఎన్ని కమిటీలు వేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. బయటకు వస్తే కేసులు పెడతారని ప్రజలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న5వేల మంది బయటకు వచ్చి రోడ్లను దిగ్బంధించారని గుర్తు చేశారు. అసలురాజధాని కావాలని విశాఖ ప్రజలు ఎప్పుడైనా అడిగారా..? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. విశాఖకు ఎన్నో సంస్థలు తెచ్చేందుకు తమ ప్రభుత్వ హయాంలో కృషి చేశామని వివరించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక సంస్థలు అన్నీ వెళ్లిపోయాయని ఆరోపించారు.ఆఖరికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సైతం రద్దు చేశారని దుయ్యబట్టారు.రాష్ట్ర ప్రజలందరూ అమరావతి కోసం కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
'రాజధాని మార్చాలని ఎవరు అడిగారు?':చంద్రబాబు - అమరావతి పరిరక్షణ సమితి వార్తలు
వైకాపా ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ప్రజలు అబీష్టం లేకుండా రాజధానిని ఎందుకు మార్చాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. అందరూ కలసి పోరాడితేనే అమరావతిని కాపాడుకోగలమని ప్రజలకు సూచించారు.
chandra-babu-fires-on-ycp-government-over-amaravati-issue