నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల నివేదిక మేరకు మళ్లీ నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది. తిరుపతిలో 6, పుంగనూరులో 3, రాయచోటిలో ఇద్దరికి నామినేషన్‌కు అవకాశం కల్పించింది. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3లోగా నామినేషన్ దాఖలుకు ఎస్‌ఈసీ సమయం కేటాయించింది. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు విధించింది.
నామినేషన్ వేసేందుకు అవకాశం ఉన్న వార్డులు
- తిరుపతిలోని 2, 8, 10, 21, 41, 45 వార్డులు
- పుంగనూరులో 9, 14, 28 వార్డులు
- రాయచోటిలో 20, 31 వార్డులు
- కడప జిల్లా ఎర్రగుంట్లలోని 6, 11, 15 వార్డులు