ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం - హైదరాబాద్​ వార్తలు

తెలంగాణలో నేడు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌ ఆగ్నేయ ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది.

Chance of light rain in the state
నేడు తేలికాపాటి వర్షాలు కురిసే అవకాశం

By

Published : Mar 23, 2021, 8:42 AM IST

మధ్యప్రదేశ్‌ ఆగ్నేయ ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

ఈ వేసవి ఆరంభంలో తొలిసారి సోమవారం మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 40.4, జన్నారంలో 40.1, వాజేడు(ములుగు)లో 39.2, కోల్వాయి(జగిత్యాల)లో 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి ఎండవేడి తీవ్రత క్రమంగా పెరుగుతుందని, గాలిలో తేమ 18 శాతం వరకూ అదనంగా ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఇదీ చదవండి

ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు యువత !

ABOUT THE AUTHOR

...view details