పుదుచ్చేరి- చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం..పుదుచ్చేరి - చెన్నై మధ్య తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 3-4 గంటల మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. వేలూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 60 కి.మీ. దూరంలో, పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వాయుగుండం బలహీనపడనున్నట్లు వెల్లడించారు. రాగల 6 గంటల్లో అది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని స్పష్టం చేశారు.
పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rain In AP) కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా పెదమాండ్యంలో అత్యధికంగా 19.9 సెంటిమీటర్లు నమోదు కాగా... కడప జిల్లా పులివెందులలో 16.9, అనంతపురం జిల్లా నల్లచెరువులో 17.1 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కడప జిల్లా సింహాద్రిపురంలో 17 సెంటిమీటర్లు, చిత్తూరు జిల్లా కలకాడలో 16.8 సెంటిమీటర్లు, వడమాలపేటలో 16.5 సెంటిమీటర్లు వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా గాజులవారీ పల్లెలో 14.8, కడప జిల్లా లింగాలలో 14.8, బుక్కరాయసముద్రంలో 14.5 సెంటిమీటర్ల వాన పడింది. ధర్మవరంలో 13.5 సెంటిమీటర్లు, తంబళ్లపల్లెలో 13.8 సెంటిమీటర్లు, పత్తికొండ 13.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
అలాగే రామచంద్రాపురంలో 13 సెంటీ మీటర్లు, పలమనేరు 13 సెంటిమీటర్లు, శ్రీకాళహస్తిలో 12.7 సెంటిమీటర్లు, ప్రకాశం జిల్లా ఉలవపాడులో 12 .5 సెంటిమీటర్లు. కడప జిల్లాలో 11 సెంటిమీటర్లు, చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఇదీ చదవండి: WEATHER UPDATE: పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు