లాక్డౌన్ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడితే... దానిని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు రాజకీయ కోణంలో చూడడం దారుణమని ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు పేర్కొన్నారు. తాము ఎవరి వద్ద బలవంతపు వసూళ్లు చేయలేదని, వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వివరించారు. బొండా ఉమా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వ్యాపారస్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
'వ్యాపారస్థులకు బొండా ఉమ క్షమాపణలు చెప్పాలి' - ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వార్తలు
తెదేపా నేత బొండా ఉమపై ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు మండిపడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తాము సేవా కార్యక్రమాలు చేపడితే దానిని బొండా ఉమ రాజకీయం చేశారని ఆక్షేపించారు.
Chamber Commerce President comments on bonda uma