ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైఎస్ హయాంలో నాసిరకం పనుల వల్లే.. పులిచింతల గేటు కొట్టుకుపోయింది' - chadrababu criticize cm jagan

వైఎస్ హయాం నాటి నాసిరకం పనుల వల్లే గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా పాలనలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. విశాఖలో బాక్సైట్ మైనింగ్​తో వేలాది కోట్లు దోచుకుంటున్నారన్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు భయపడి పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయన్నారు

chadrababu
తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Aug 6, 2021, 9:20 PM IST

వైఎస్ హయాం నాటి నాసిరకం పనుల వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. అప్పులు చేసి స్కామ్​లు చేసే స్కీమ్​లకు నిధులు మళ్లించారని ధ్వజమెత్తారు. టీడీఎల్పీ, పార్టీ ముఖ్యనేతలతో అయన వర్చువల్ సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. పెన్షనర్లు కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమా బెయిల్​పై విడుదలై బయటకు వస్తే.. చట్టవిరుద్ధంగా జాతీయ రహదారిని బ్లాక్ చేశారన్నారు.

పోలవరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని చంద్రబాబు వెల్లడించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. విశాఖలో బాక్సైట్ మైనింగ్​తో వేలాది కోట్లు దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు భయపడి పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయన్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేశారన్న చంద్రబాబు... రూ.2 లక్షల కోట్ల సంపదను నిరుపయోగ ఆస్తిగా మార్చారని మండిపడ్డారు. అమరావతి పోరాటానికి 600 రోజులు పూర్తవుతోందన్న ఆయన వారి పోరాటానికి మద్దతు ప్రకటించారు.

ఇదీ చదవండి

PULICHINTALA: పులిచింతలలో స్టాప్‌లాక్ ఏర్పాటు పనులు నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details