ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మున్సిపల్ మంత్రి, అధికారులు మున్సిపల్ శాఖపై సమీక్ష జరిపిన తీరుపై సీహెచ్ బాబూరావు మండిపడ్డారు. ఒకవైపు కరోనా, ఆర్థిక మాంద్యంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన గుర్తుచేశారు. వ్యాపారాలు దెబ్బతిని, ప్రజలు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో పన్నులలో రాయితీలు ఇవ్వాలని, వడ్డీలు, పెనాల్టీలు రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారన్న బాబూరావు.. ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
'ఇంటి పన్ను పెంచడంపై ప్రభుత్వం పునరాలోచించాలి' - ఏపీలో ఇంటి పన్నులు న్యూస్
ఆస్తిపన్ను, ఇంటి పన్నులు సవరించే అంశాలు పట్టణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్ బాబూరావు వ్యాఖ్యానించారు. పన్నులు సవరించడానికి వీలుగా అధికారుల బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపాలని నిర్ణయించినట్లు ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు.

ch baburao on houses tax