ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు - Space Science and Technology

పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో... స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏడాది సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త రామమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కోర్సు పుస్తకాలు ఆవిష్కరించారు.

స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు

By

Published : Aug 24, 2019, 4:19 PM IST

స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు

విజయవాడలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో... స్పేస్​ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏడాది సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టారు. ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త రామమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని... ఈ కోర్సు పుస్తకాలు ఆవిష్కరించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే ఈ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని రామమూర్తి పేర్కొన్నారు. భవిష్యత్తులో శాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో విద్యార్థుల తమ ప్రతిభ చాటుకునే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 'స్పేస్ 360' సంస్థ తమ కళాశాలలో ఈ కోర్సుపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని... ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వరరావు అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details