ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేగంగా ఆక్సిజన్ సరఫరాకు.. ఎయిర్​ఫోర్స్ విమానాల వినియోగం - ఏపీకి ఎయిర్ ఫోర్స్ విమానాల ద్యారా ఆక్సిజన్ సరఫరా

రాష్ట్రానికి ఆక్సిజన్​ను వేగంగా సరఫరా చేసేందుకు కేంద్రం ఎయిర్ ఫోర్స్​ విమానాలను వినియోగిస్తోంది. 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయించిన కేంద్రం.. ఒడిశాలోని ఆంగుల్ ప్లాంట్ల నుంచి 110 మెట్రిక్ టన్నులు కేటాయించింది. విజయవాడ, గన్నవరం విమానాశ్రయం నుంచి 2 ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించారు.

airforce to oxyzen supply
airforce to oxyzen supply

By

Published : May 1, 2021, 4:49 PM IST

ఆక్సిజన్ వేగంగా సరఫరా చేసేందుకు ఎయిర్​ఫోర్స్ విమానాల వినియోగం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్​ను వేగంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఎయిర్ ఫోర్సు విమానాలను వినియోగిస్తోంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను పూర్తిస్థాయిలో తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా ఒడిశాలోని ఆంగుల్​లో టాటా స్టీల్, జిందాల్ స్టీల్ ప్లాంట్ల నుంచి కేటాయించిన 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను రాష్ట్రానికి రప్పించేందుకు... విజయవాడ, గన్నవరం విమానాశ్రయం నుంచి రెండు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించారు.

ABOUT THE AUTHOR

...view details