బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రి షెకావత్‌తో సమావేశమైన సీఎం జగన్.. పెండింగ్ నిధుల విడుదలకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబరు కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.., వీలు చూసుకుని ప్రాజెక్టును సందర్శించాలని కోరారు. గోదావరి-పెన్నా అనుసంధానానికి సహకరించాలని జగన్‌ను కేంద్ర మంత్రి షెకావత్ కోరారు. నదుల అనుసంధానంలో భాగంగా.... గోదావరి- కావేరి అనుసంధానం చేయాలని కేంద్రం యోచిస్తోందన్నారు.
గోదావరి-కావేరి అనుసంధానికి సహకరించాలి: సీఎంతో కేంద్రమంత్రి షెకావత్ - పోలవరంపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కామెంట్స్ న్యూస్
పోలవరం ప్రాజెక్టుతో ఎవరికీ ఇబ్బంది రానీయొద్దని సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి... కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సూచించారు. ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. భూసేకరణ, పునరావాసం, పరిహారాలకూ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గోదావరి-కృష్ణా-పెన్నా వరకు అనుసంధానించాలని భావిస్తున్నామని, తెలంగాణ మాత్రం గోదావరి-కృష్ణా వరకు చాలంటోందని.. జగన్ తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానం వల్ల తెలంగాణ, ఏపీలోని రాయలసీమ సహా..తమిళనాడుకూ ప్రయోజనం ఉంటుందని.. వివరించారు. నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ వెదిరెను ఏపీకి పంపితే.. కేంద్ర, రాష్ట్ర ప్రణాళికలపై చర్చిస్తామని, అందరికీ ఆమోదయోగ్యం అయినదానికే ప్రాధాన్యం ఇద్దామని కేంద్ర మంత్రికి జగన్ వివరించారు.
ఇదీ చదవండి:ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి