గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతీయ సంగీత చరిత్రపై బాలసుబ్రహ్మణ్యం చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
'బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు' - ఎస్పీ బాలు మరణం తాజా వార్తలు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు.
!['బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు' central-minister-kishanreddy-condolence-on-sp-balu-death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8934376-175-8934376-1601030192345.jpg)
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి
అనేక భాషల్లో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోయడంతో పాటు అభిమానులను అలరించారన్నారు. ఎంతోమంది ఔత్సాహిక యువ గాయకుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదీచదవండి.