ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ap three capitals repeal bill: ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటే మంచిదే: కిషన్ రెడ్డి - VIJAYAWADA LATEST NEWS

మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజల మనోభావాలే అన్నింటికన్నా ముఖ్యమని అన్నారు.

CENTRAL MINISTER KISHAN REDDY ON CAPITAL AMARAVATI
CENTRAL MINISTER KISHAN REDDY ON CAPITAL AMARAVATI

By

Published : Nov 22, 2021, 10:12 PM IST

మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(KISHAN REDDY ON THREE CAPITALS WITHDRAWAL) స్పందించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర భాజపా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా స్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజల అభీష్టం మేరకే ఏపీ భాజపా అమరావతి రాజధానికి మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనని అన్నారు. రైతుల‌ మేలును దృష్టిలో పెట్టుకునే కేంద్రం రైతు చట్టాలను(KISHAN REDDY ON FARM LAWS) వెనక్కి తీసుకున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details