ప్రతి పబ్లిక్ సెక్టార్ కంపెనీని అమ్మకానికి పెట్టబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను ప్రైవేటీకరణ చేస్తామని తెలిపారు. ఒప్పందం ప్రకారం పోలవరానికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు. పోలవరం నిధులపై ఏపీ ఆర్థికమంత్రి 3 సార్లు కలిశారని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగలేదన్న కేంద్రమంత్రి.. బడ్జెట్‌ను జాతీయ దృక్పథంతో చూడాలని కోరారు.
నీతిఆయోగ్ సూచన మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం: అనురాగ్ ఠాకూర్ - విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రమంత్రి కామెంట్స్
విశాఖ ఉక్కు పరిశ్రమ, పోలవరంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. నీతి ఆయోగ్ సూచన మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
నీతిఆయోగ్ సూచన మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం: అనురాగ్ ఠాకూర్
TAGGED:
నీతి ఆయోగ్ తాజా వార్తలు